తెలంగాణ పదోతరగతి పుస్తకాల్లో ఎన్టీఆర్ జీవితంపై పాఠ్యాంశం.. కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన బాలకృష్ణ

  • ఎన్టీఆర్ పై కేసీఆర్ కు అమితమైన గౌరవాభిమానాలు
  • సాంఘికశాస్త్రం 268వ పేజీలో ఎన్టీఆర్ పాఠ్యాంశం
  • హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దివంగత ఎన్టీఆర్ అంటే ఎంతటి గౌరవాభిమానాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ 'ఒక్క మగాడు' అంటూ పలు సందర్భాల్లో కేసీఆర్ అన్నారు. అంతేకాదు, ఎన్టీఆర్ మీద అభిమానంతో తన తనయుడికి తారకరామారావు అని పేరు కూడా పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ పదో తరగతి పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఒక పాఠ్యాంశాన్ని పెట్టించారు. సోషల్ స్టడీస్ లో పేజీ నంబర్ 268లో ఎన్టీఆర్ కు సంబంధించిన కీలక అంశాలను పేర్కొన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో పెట్టడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క, తన తండ్రి జీవితాన్ని గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా పాఠ్య పుస్తకంలో ప్రచురించడం పట్ల నందమూరి బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫేస్ బుక్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2FNandamuriBalakrishna%2Fposts%2F3473490776036430&show_text=true&width=552&height=830&appId" width="552" height="830" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allow="encrypted-media"></iframe>


More Telugu News