దమ్మున్న నాయకుడిగా జగన్ సంస్కరణల దిశగా ముందడుగు వేశారు: సజ్జల
- ఉచిత విద్యుత్ పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
- నగదు బదిలీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలి
- ఉచిత విద్యుత్ వైయస్ తీసుకొచ్చిన పథకం
ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ టీడీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో జగన్ వెనకడుగు వేయరని చెప్పారు. రైతులను అన్ని విధాలా ఆదుకోవడమే సీఎం అభిమతమని తెలిపారు. ఉచిత విద్యుత్ కు నగదు బదిలీ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని కోరారు. వాస్తవానికి ఉచిత విద్యుత్ అనేది ఎవరో పోరాడి సాధించుకున్నది కాదని... దివంగత వైయస్ తీసుకొచ్చిన పథకమని చెప్పారు. పెరిగిన కరెంటు చార్జీలపై నిరసన చేస్తున్న వారి ప్రాణాలు తీసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు.
వైయస్ ఆలోచనలతో పుట్టిన ఉచిత విద్యుత్ పథకానికి ఆటంకం కలగదని సజ్జల చెప్పారు. ఉచిత విద్యుత్ వైయస్ పేటెంటైతే... ఊరూరా బెల్టు షాపులు చంద్రబాబు పేటెంట్ అని అన్నారు. విద్యుత్ సంస్థలు వేల కోట్ల బకాయిలను మోయలేక కునారిల్లుతున్నాయని.... ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సవరణలు మన మీద ప్రభావం చూపే అవకాశం ఉందని... దీనికి మనం సమాయత్తం కావాలనే ఉద్దేశంతో... దమ్మున్న నేతగా జగన్ సంస్కరణల దిశగా ముందడుగు వేశారని చెప్పారు.