సుశాంత్ మరణానంతర పరిణామాలపై భారత చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్ర అసంతృప్తి
- బాలీవుడ్ ను కుదిపేసిన సుశాంత్ ఆత్మహత్య
- తీవ్రంగా స్పందించిన నిర్మాతల మండలి
- బాలీవుడ్ కొత్త ప్రతిభను ఎప్పుడూ ఆహ్వానిస్తుందని వెల్లడి
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో తీవ్ర కలకలం ఏర్పడడంతో పాటు రాజకీయ దుమారం కూడా రేగింది. ఈ పరిణామాలపై భారత చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాసింది. సుశాంత్ విషాదాంతాన్ని సినీ ఇండస్ట్రీతో పాటు సినీ పరిశ్రమ సభ్యుల ప్రతిష్ఠను మంటగలిపేలా వాడుకుంటున్నారని ఆరోపించింది.
ఏ రంగంలో లోపాలు లేవు? అంటూ ప్రశ్నించిన నిర్మాతల మండలి, బాలీవుడ్ లోనూ కొన్ని లోపాలు ఉన్నాయని, అంతమాత్రాన పరిశ్రమ మొత్తాన్ని ఒకే గాటనకట్టడం సరికాదని అభిప్రాయపడింది. బాలీవుడ్ తో సంబంధంలేని ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారని, ఇతర విభాగాలకు చెందిన ఎంతోమంది బ్యాక్ గ్రౌండ్ లేకున్నా ఎదిగారని వివరించింది.
కానీ ఇండస్ట్రీలో కొత్తవారు ఎదగడం కష్టమంటూ మీడియాలో కథనాలు రావడం బాధాకరమని నిర్మాతల మండలి అభిప్రాయపడింది. నూతన నైపుణ్యాలను ఇండస్ట్రీ అడ్డుకుందని ప్రచారం చేయడం తగదని హితవు పలికింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి బాలీవుడ్ కొత్త ప్రతిభను ఆహ్వానించిందని తెలిపింది.