నా ఒక్కడికి సమాధానం చెప్పడానికి ముగ్గురా... ఏంటిది జగన్ గారూ?: దేవినేని ఉమ
- కొడాలి నాని వ్యాఖ్యలకు బదులిచ్చిన ఉమ
- ఏంటీ భాష అంటూ విమర్శలు
- చదువు సంస్కారం లేని కొడాలి నాని అంటూ ఉమ వ్యాఖ్యలు
ఉచిత విద్యుత్ పథకాన్ని అటకెక్కిస్తున్నారని, మీటర్ల పేరుతో రైతుల గొంతు కోయబోతున్నారని, వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం సున్నా అయిందని, రైతు రుణాలకు వడ్డీలు కట్టించుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. సున్నా వడ్డీ పథకం ఎంత మోసమో, ఇప్పుడీ నగదు బదిలీ కూడా అంతే మోసమని విమర్శించారు. సంపద సృష్టించడం చేతకాక, రూ.లక్ష 8 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు.
ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానన్నట్టు ఇప్పుడు 10 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తామంటున్నారని ఉమ ఎద్దేవా చేశారు. "మీరు 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేంతవరకు రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తారా... ఏంచెబుతున్నారండీ! వీటికి సమాధానం చెప్పలేక మాపై విమర్శలు చేస్తున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు చేసిన విద్యుత్ సంస్కరణల వల్లే ఆ తర్వాత ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మార్గం సుగమం అయింది. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా చేయలేక, మంజూరైన నిధులను వేరే రంగాలకు తరలించింది.
రాష్ట్రం విడిపోయే నాటికి ఆ కష్టాలు రెట్టింపవగా, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించడమే కాదు, 5 సంవత్సరాల్లో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించి రాష్ట్రంలో అటు రైతాంగానికి, ప్రజలకు కరెంటు కొరత రానివ్వని చరిత్ర చంద్రబాబుదీ, టీడీపీదీ. మీరు ఇవాళ ఆ విధంగా విద్యుత్ ఇవ్వలేక, సోలార్ ఎనర్జీలో కమీషన్లకు కక్కుర్తిపడి మీటర్ల కొనుగోలులో వందల కోట్ల అవినీతికి సిద్ధపడి ఈ డ్రామా ముందుకు తీసుకువచ్చారు. దీని గురించి ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఇవాళ బూతుల మంత్రితో బూతులు మాట్లాడించారు.
ప్రశ్నిస్తే లారీలతో గుద్దిస్తారా? ఎక్కడికి పోతోందీ రాష్ట్రం? సీఎం జగన్, డిఫాక్టో హోం మినిస్టర్ గా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పోలీసు వ్యవహారాలు చూస్తున్న అవినాష్... ఈ ముగ్గురే కుట్రదారులు. వీళ్ల డైరెక్షన్ లోనే మంత్రి కొడాలి నాని నన్ను లారీలతో గుద్దిస్తానని బెదిరిస్తున్నాడు. దీన్ని డీజీపీ సుమోటోగా స్వీకరిస్తారా?
కొడాలి నాని ఇవాళ మాట్లాడిన భాష చూస్తుంటే దారుణంగా ఉంది. చదువు సంస్కారాన్నిస్తుంది. కానీ చదువు సంస్కారాలు లేని కొడాలి నానీ... నీవు చంద్రబాబు వయసు గురించి, మా చావు పుట్టుకల గురించి మాట్లాడుతున్నావు. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఎందుకీ గల్లీ రాజకీయాలు? మీ చేతకాని తనం కప్పిపుచ్చుకోవడానికే ఈ భాష మాట్లాడుతున్నారా? ఇవాళ మీడియా సమావేశంలో కొడాలి నానితో పాటు వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీ ఉన్నారు. నా ఒక్కడికి సమాధానం చెప్పడానికి ముగ్గురా... ఏంటిది జగన్ గారూ?" అంటూ దేవినేని ఉమ వ్యాఖ్యానించారు.