నా ప్రత్యక్ష దైవం చంద్రబాబు, అభిమానుల ప్రార్థనలతో కరోనా నుండి కోలుకున్నాను: బుద్ధా వెంకన్న
- పదవులు శాశ్వతం కాదు
- నాయకుడిని నమ్ముకొని ముందుకు వెళ్లడమే నా సిద్ధాంతం
- కష్ట కాలంలో ఇచ్చిన మనోధైర్యం ఎన్నటికీ మరువను
తనకు కొవిడ్-19 టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆగస్టు 28న ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండమని డాక్టర్ సూచించారని, ఈ 14 రోజులు తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆయన అప్పట్లో ప్రకటించారు. అప్పటి నుంచి ఎటువంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు.
తాజాగా తన ఆరోగ్యంపై ట్వీట్ చేస్తూ 'నా ప్రత్యక్ష దైవం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దైర్యం, అభిమానుల ప్రార్థనలతో కరోనా నుండి త్వరగా కోలుకున్నాను. పదవులు శాశ్వతం కాదు. నాయకుడిని నమ్ముకొని ముందుకు వెళ్లడమే నా సిద్ధాంతం. కష్ట కాలంలో చంద్రబాబు గారు ఇచ్చిన మనోధైర్యం ఎన్నటికీ మరువను' అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.