ఐపీఎస్‌ ప్రొబేషనర్లను ఇంటికి ఆహ్వానించేవాడిని.. ఈ సారి కలుసుకోలేకపోతున్నాను: మోదీ

  • శిక్షణ పూర్తి చేసుకున్న 131 మంది ఐపీఎస్‌లు
  • ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో మోదీ ప్రసంగం
  • కరోనా కట్టడిలో పోలీసులు ముందుండి పోరాడుతున్నారని ప్రశంస
  • ఒ‌త్తిడిలో ప‌నిచేసేవాళ్ల‌కు యోగా ఉపయోగ‌ప‌డుతుంద‌ని వ్యాఖ్య
హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఈ ఏడాది 131 మంది ఐపీఎస్‌ అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిలో 11 మందిని తెలంగాణకు, ఐదుగురిని ఏపీకి ఇప్పటికే కేటాయించారు. శిక్షణ పూర్తయిన సందర్భంగా ఐపీఎస్‌ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోదీ మాట్లాడారు.  

కరోనా కట్టడిలో పోలీసులు ముందుండి పోరాడుతూ, సేవలందిస్తున్నారని ఆయన కొనియాడారు. కరోనా సంక్షోభం సమయంలో పోలీసులు తమ పాత్రను చరిత్రలో లిఖించేలా సేవలందించారని చెప్పారు. సాధారణంగా ఐపీఎస్‌ ప్రొబేషనర్లను తాను ఇంటికి ఆహ్వానించేవాడినని, కరోనా కారణంగా కొత్త ఐపీఎస్‌లను ఈ సారి కలుసుకోలేకపోతున్నానని చెప్పారు.

తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న 131 మంది ఐపీఎస్‌ అధికారులను తాను త‌న ప‌ద‌వీ కాలంలో ఏదో ఒక‌సారి క‌చ్చితంగా క‌లుస్తాన‌న్నారు. ప్రజాసేవలో ఉండే అధికారులు అరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. ఒ‌త్తిడిలో ప‌నిచేసేవాళ్ల‌కు యోగా, ప్రాణాయామం బాగా ఉపయోగ‌ప‌డతాయని చెప్పారు .


More Telugu News