సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు.. షోవిక్ చక్రవర్తి, శామ్యూల్‌కు నోటీసులు!

సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా ఇంట్లో ఎన్‌సీబీ సోదాలు.. షోవిక్ చక్రవర్తి, శామ్యూల్‌కు నోటీసులు!
  • రియా సోదరుడు షోవిక్ ఇంట్లోనూ సోదాలు
  • సుశాంత్ మేనేజర్ శామ్యూల్‌ను నియమించింది రియానే
  • కొనసాగుతున్న తనిఖీలు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో రోజుకో సంచలన విషయం బయటకు వస్తుండగా, తాజాగా ఈ రోజు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అతడి ప్రియురాలు, నటి రియా చక్రవర్తి ఇంట్లో ఈ ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సోదాలు జరిపింది. మాదక ద్రవ్యాల డీలర్ జైద్ విలాత్రాను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఎన్‌సీబీ తాజాగా రియా ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం రియా సోదరుడు షోవిక్ చక్రవర్తితోపాటు రియా ఇంట్లోనూ సోదాలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

ఇటీవల ఎన్‌సీబీ అధికారులు మాట్లాడుతూ షోవిక్ సూచనల మేరకే సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా డ్రగ్స్ సేకరించినట్టు తమకు తెలిసిందని పేర్కొన్నారు. మిరాండాను రియానే గతేడాది సుశాంత్ మేనేజర్‌గా నియమించింది. అప్పటి నుంచి సుశాంత్ ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలను అతడే చూసుకునేవాడు. మిరాండా ఇంట్లోనూ ఎన్‌సీబీ తనిఖీలు నిర్వహించింది. తనిఖీలు కొనసాగుతున్నాయని, విచారణకు రావాల్సిందిగా షోవిక్ చక్రవర్తికి, శామ్యూల్ మిరాండాకు సమన్లు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


More Telugu News