తెలంగాణ పోలీస్ శాఖలో 272 పోస్టుల రద్దు.. కాంట్రాక్ట్ కార్మికులతో భర్తీ చేసుకోవాలని సూచన
- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- బార్బర్, కుక్, ధోబీ, నర్సింగ్, ఫార్మసిస్ట్ వంటి విభాగాల్లో కోత
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
పోలీసు బెటాలియన్లలో రెగ్యులర్ పోస్టుల్లో కొన్నింటిని రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బార్బర్, కుక్, ధోబీ, నర్సింగ్, మిడ్‌వైఫ్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియో థెరపిస్ట్, స్కావెంజర్, స్వీపర్ వంటి విభాగాల్లోని మొత్తం 272 పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులతో ఆ ఖాళీలను భర్తీ చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఆర్థిశాఖ ప్రత్యేక కార్యదర్శి డి.రొనాల్డ్‌రాస్ ఉత్తర్వులు జారీ చేశారు.