ఈ నెలాఖరులో జైలు నుంచి విడుదల కానున్న శశికళ

  • ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో విడుదల
  • వెల్లడించిన ఆమె తరపు న్యాయవాది
  • తమిళ రాజకీయాల్లో పెరగనున్న వేడి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ఈ నెలాఖరులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరు లేదంటే, వచ్చే నెల మొదటి వారంలో శశికళ జైలు నుంచి విడుదలవుతారని ఆమె తరపు న్యాయవాది రాజా సెంధూర్ పాండ్యన్ తెలిపారు.

అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన శశికళ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. నిజానికి ఆమె వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉంది. అయితే, సత్ప్రవర్తన కారణంగా మినహాయింపు పొందుతున్నారని ఆయన చెప్పారు.  

ఇక, తమిళనాడులో ఇప్పటికే సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాల మధ్య అంతర్గత పోరు జరుగుతోంది. ఈ నేపథ్యంలో శశికళ జైలు నుంచి బయటకు వస్తే రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయమని చెబుతున్నారు.


More Telugu News