ఏపీలో కరోనా మరణాలు తగ్గుతున్నాయి: కేంద్రం
- వారానికి 4.5 శాతం తగ్గుదల కనిపిస్తోందన్న కేంద్రం
- మహారాష్ట్ర, తమిళనాడులోనూ తగ్గుదల
- ఢిల్లీ, కర్ణాటకల్లో పెరుగుతున్న మరణాలు
ఏపీలో ఇటీవల కొన్నిరోజుల పాటు అత్యధిక సంఖ్యలో కరోనా మరణాలు సంభవించాయి. అయితే పరిస్థితి ఇప్పుడిప్పుడే కుదుటపడ్డట్టు కనిపిస్తోంది. దీనిపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఏపీలో కరోనా మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతోందని వెల్లడించింది. వారానికి 4.5 శాతం తగ్గుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. అదే సమయంలో మహారాష్ట్రలో 11.5 శాతం, తమిళనాడులో 18.2 శాతం తగ్గుదల నమోదైందని వివరించారు.
మరోపక్క, కర్ణాటక, ఢిల్లీలో కరోనా మరణాలు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఢిల్లీలో వారానికి 50 శాతం, కర్ణాటకలో రోజుకు 9.6 శాతం పెరుగుదల కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త గణాంకాలతో పోల్చితే భారత్ లో ప్రతి 10 లక్షల మందిలో 2,792 పాజిటివ్ కేసులు, 49 మరణాలు సంభవిస్తున్నాయని రాజేశ్ భూషణ్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 30 లక్షల మంది కోలుకున్నారని వెల్లడించారు.