నువ్వు కోరుకున్న రాజకీయం వచ్చినరోజు సమసమాజం దానంతట అదే వస్తుంది పవన్: పరుచూరి గోపాలకృష్ణ

  • నిన్న పవన్ జన్మదినం
  • విషెస్ తెలిపినవారికి ఓపిగ్గా రిప్లయ్ లు ఇస్తున్న పవన్
  • పరుచూరికి కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని
నిన్న పుట్టినరోజు జరుపుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పవన్ ఇవాళ ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. అందరికీ ఎంతో ఓపిగ్గా బదులిస్తున్నారు.

ఈ క్రమంలో తనకు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణకు కూడా పవన్ కృతజ్ఞతలు తెలిపారు. మీ శుభాకాంక్షలు మరిచిపోలేనని, గుండెల్లో పదిలంగా ఉంచుకునేవని పేర్కొన్నారు.

దీనిపై పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. "పవన్... నీ సమాధానంలోనే నీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమవుతోంది. అందుకే నువ్వు కోరుకున్న రాజకీయం వచ్చిన రోజు సమసమాజం దానంతట అదే వస్తుందని నాకూ తెలుసు. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.



More Telugu News