భారతీయుడు అయినంత మాత్రాన కోహ్లీని అభినందించకుండా ఎలా ఉండగలం?: అక్తర్

  • కోహ్లీపై అభిమానాన్ని దాచుకోలేనన్న అక్తర్
  • భారత ఆటగాళ్లను ప్రశంసిస్తుంటాడంటూ అక్తర్ పై పాక్ లో విమర్శలు
  • ఎవరేమనుకున్నా కోహ్లీనే బెస్ట్ అంటూ వ్యాఖ్యలు
ఎప్పుడూ భారత ఆటగాళ్లనే ప్రశంసిస్తుంటాడని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ పై స్వదేశంలో విమర్శలు వస్తుంటాయి. అయినప్పటికీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై తన అభిమానాన్ని దాచుకోలేనని, కోహ్లీని ప్రశంసించడం తప్పేమీ కాదని అక్తర్ స్పష్టం చేశాడు. కోహ్లీని మించిన ఆటగాడు ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో మరెవ్వరూ లేరని అన్నాడు.

అసలు ఓ అత్యుత్తమ ఆటగాడి టాలెంట్ ను మెచ్చుకోవడం తప్పవుతుందా? అంటూ అక్తర్ ప్రశ్నించాడు. భారత క్రికెటర్లనే కాకుండా, అంతర్జాతీయంగా ప్రతిభ చాటిన ఏ దేశానికి చెందిన క్రికెటర్నయినా అభినందిస్తానని తెలిపాడు. భారత్ కు చెందినవాడు అయినంతమాత్రాన కోహ్లీని మెచ్చుకోకుండా ఎలా ఉండగలం? అని అడిగాడు. అందుకే ఎవరేమనుకున్నా కోహ్లీని అభినందిస్తూనే ఉంటానని అక్తర్ స్పష్టం చేశాడు.


More Telugu News