కరోనా కష్టకాలంలో విద్యార్థిని ఆదుకున్న యాంకర్ ప్రదీప్
- డీ మార్ట్ లో పనిచేస్తూ చదువుకుంటున్న విద్యార్థి
- లాక్ డౌన్ తో సొంతూరికి పయనం
- పుస్తకాలు కొనేందుకు డబ్బు లేదంటూ ప్రదీప్ ను అర్థించిన వైనం
- పుస్తకాలు ఆర్డర్ ఇవ్వడంతో పాటు ఫీజు కూడా కట్టేసిన ప్రదీప్
టీవీ యాంకర్ గా, సినీ నటుడిగా ప్రస్థానం సాగిస్తున్న ప్రదీప్ తాజాగా ఓ విద్యార్థి పట్ల ఔదార్యం ప్రదర్శించాడు. తన చదువులకు అవసరమైన ఫీజులు చెల్లించలేకున్నానని, పుస్తకాలు కూడా కొనలేకున్నానని ఓ విద్యార్థి అర్థించగా, యాంకర్ ప్రదీప్ వెంటనే సాయం చేశాడు. బాలరాజు అనే విద్యార్థి కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో తాను కష్టాల్లో పడ్డానని యాంకర్ ప్రదీప్ కు ట్వీట్ చేశాడు.
"అన్నా ప్లీజ్ హెల్ప్ మీ. నా ఉన్నత చదువుల కోసం అవసరమైన డబ్బులు సంపాదించుకునేందుకు కరోనా ముందు వరకు డీ మార్ట్ లో పనిచేసేవాడిని. ఇప్పుడు లాక్ డౌన్ కావడంతో మా ఊరు వచ్చేశాను. కానీ ఆన్ లైన్ క్లాసులు మొదలయ్యాయి. కొన్ని పుస్తకాలు కొనుక్కోవాల్సి ఉంది. నువ్వు ఎలాగైనా సాయం చేయి అన్నా" అంటూ బాలరాజు దీనంగా మొరపెట్టుకున్నాడు. ఆ విద్యార్థి పరిస్థితి పట్ల ప్రదీప్ చలించిపోయాడు. వెంటనే ఆ పుస్తకాలు ఈకామర్స్ పోర్టల్ లో ఆర్డర్ చేయడమే కాకుండా, ఆ విద్యార్థి ఉన్నతచదువులకు అయ్యే ఫీజు రూ.10 వేలు కూడా కట్టేశాడు.
ఆ రసీదులను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసిన ప్రదీప్... డియర్ బాలరాజు బ్రదర్, సెప్టెంబరు 11 నాటికి నీ పుస్తకాలు నీకందుతాయి. అంతేకాదు నీ ఫీజు కూడా కట్టేశాను. నీ భవిష్యత్తు బాగా సాగాలని కోరుకుంటున్నాను బ్రదర్ అంటూ ట్వీట్ చేశాడు. దాంతో బాలరాజు సంబరపడిపోయాడు. అన్నా నీ సాయం వృథా పోనివ్వకుండా కష్టపడి చదివి ప్రయోజకుడ్నయి నీ ముందు నిలబడతాను అంటూ ధన్యవాదాలు తెలుపుకున్నాడు.