యుద్ధానికి చైనా సన్నద్ధమవుతోంది.. మనం కూడా రెడీ అవ్వాలి: సుబ్రహ్మణ్యస్వామి

  • సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం
  • ప్రతీకార దాడులకు సిద్ధం కావాలన్న సుబ్రహ్మణ్యస్వామి
  • లేహ్ ఆర్మీ బేస్ కు చేరుకున్న ఆర్మీ చీఫ్
భారత్, చైనాల మధ్య యుద్ధవాతావరణం నెలకొందని బీజేపీ రాజ్యసభసభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి తెలిపారు. యుద్ధానికి చైనా సన్నద్ధమవుతోందని, చైనా యుద్ధ విమానాలు తరుముకొస్తున్నాయని అన్నారు. భారత్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధపడాల్సిన తరుణం ఆసన్నమైందని చెప్పారు.

గత నెల 29,30 తేదీల్లో భారత్, చైనా సైనికుల మధ్య పాంగ్యాంగ్ లేక్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. మన భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకొచ్చేందుకు యత్నించగా... మన సైనికులు వారిని అడ్డుకున్నారు. ఇరు దేశాల సైనికుల మధ్య తోపులాట జరిగింది. దీంతో, పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి.

అదే సమయంలో భారత ఆర్మీ చీఫ్ నరవణె లడఖ్ పర్యటనలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆయన లేహ్ ఆర్మీ బేస్ లో ఉన్నారు. ఈ ఉదయం ఢిల్లీ నుంచి ఆయన నేరుగా లేహ్ బేస్ క్యాంపుకు చేరుకున్నారు. సరిహద్దు భద్రత, సైనికులు, యుద్ధ విమానాల మోహరింపుపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు.


More Telugu News