చైనాలో ఆందోళనకు దిగిన మంగోలియన్లు!

  • కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చిన చైనా
  • మంగోలియన్ల ప్రాంతంలో మాండరిన్ భాషకు ప్రాధాన్యత
  • చచ్చేంత వరకు తాము మంగోలియన్లమేనంటూ ఆందోళన
చైనా ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది మంగోలియా జాతి ప్రజలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్త విద్యావిధానంలో మాండరిన్ భాషకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, తమ భాషను తగ్గించడంతో వారు మండిపడ్డారు. చైనా కొత్త విద్యావిధానం వల్ల ఎలిమెంటరీ, మాధ్యమిక పాఠశాలల విద్యాబోధనలో మంగోలియన్ భాషను మాండరిన్ క్రమంగా ఆక్రమిస్తుంది. దీంతో, చైనాలో మంగోలియన్లు నివసించే ప్రాంతంలో తమ భాష ఉనికిని కోల్పోతుందని వారు ఆందోళనకు గురవుతున్నారు.

దీంతో పాఠశాలల ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శాంతియుతంగా తమ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంగోలియన్ అనేది తమ మాతృభాష అని... చచ్చేంత వరకు తాము మంగోలియన్లమేనని చెప్పారు. చైనా ప్రభుత్వం తమ భాషను, సంస్కృతిని బలవంతంగా అణచివేయాలనుకోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News