లాక్ డౌన్ రీస్టార్ట్ మాన్యువల్ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
- పుస్తకాన్ని ప్రచురించిన వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి గ్రూప్
- కేటీఆర్ చాంబర్ లో పుస్తకావిష్కరణ
- హాజరైన ఉన్నతవిద్యామండలి చైర్మన్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓ పుస్తకావిష్కరణ చేశారు. వల్లూరుపల్లి నాగేశ్వరరావు విజ్ఞానజ్యోతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (వీఎన్ఆర్ వీజేఈటీ) ఆర్గనైజేషన్ ప్రచురించిన 'పోస్ట్ లాక్ డౌన్ రీస్టార్ట్ మాన్యువల్: ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ ఆఫ్ కొవిడ్-19' అనే పుస్తకాన్ని కేటీఆర్ తన చాంబర్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞానజ్యోతి విద్యాసంస్థల అధ్యక్షుడు డీఎన్ రావు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి కూడా పాల్గొన్నారు.