తెలంగాణలో కరోనా కొత్త కేసులు 2,817.. లక్ష దాటిన డిశ్చార్జి కేసులు
- మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,406
- ఆసుపత్రుల్లో 32,537 మందికి చికిత్స
- జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 452 కేసులు
తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. మరోపక్క, రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య లక్ష దాటింది. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం... రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 2,817 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,611 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,406కి చేరింది. తెలంగాణలోని ఆసుపత్రుల్లో 32,537 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 1,00,013 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 856కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 452 కరోనా కేసులు నమోదయ్యాయి.