ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

  • వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ ఖాతాల హ్యాక్
  • దర్యాప్తు ప్రారంభించిన ట్విట్టర్
  • జులైలో పలువురి ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేసిన దుండగులు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఈ తెల్లవారుజామున హ్యాక్‌కు గురయ్యాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ నిర్ధారించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్టు ట్విట్టర్ ప్రతినిధులు పేర్కొన్నారు. మోదీ ట్విట్టర్ ఖాతా ఈ తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో హ్యాక్ అయినట్టు తెలిపింది. హ్యాక్ అయిన మోదీ ఖాతాకు 2.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

జులైలో పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్‌కు గురవడం సంచలనమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం కలకలం రేపుతోంది. జులైలో హ్యాక్‌కు గురైన ట్విట్టర్ ఖాతాల్లో అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిలియనీర్ ఎలాన్ మస్క్ వంటి వారివి ఉన్నాయి.


More Telugu News