తిరుమల మ్యూజియం వద్ద చిరుతపులి సంచారం

  • గత రాత్రి తిరుమల వీధుల్లో తిరుగాడిన చిరుత
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో
  • ఇటీవల తరచుగా తిరుమలలో వన్యప్రాణుల దర్శనం
కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారం ఆ కోనేటిరాయుడి దివ్య సన్నిధానం తిరుమల క్షేత్రంలో ఇటీవల కాలంలో తరచుగా వన్యప్రాణులు దర్శనమిస్తున్నాయి. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా తిరుమల క్షేత్రం కొన్నాళ్లు మూతపడి, ఆ తర్వాత తిరిగి తెరుచుకున్నా మునుపటిలా భక్తుల వెల్లువ కనిపించడంలేదు.

దాంతో జంతువులు ఎలాంటి బెరుకు లేకుండా తిరుమల వీధుల్లో సంచరిస్తున్నాయి. తాజాగా, ఓ చిరుతపులి తిరుమల శ్రీవారి మ్యూజియం వద్ద గతరాత్రి తిరుగాడినట్టు వెల్లడైంది. మాడవీధికి సమీపంలో ఉన్న మ్యూజియం వద్ద గోడపై కాసేపు కూర్చున్న ఆ చిరుత అక్కడే కొద్దిసేపు సంచరించి అటవీప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.



More Telugu News