శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో మరో అగ్నిప్రమాదం.. మాక్ డ్రిల్ లో భాగమని చెప్పిన జెన్ కో సీఎండీ!
- ఇటీవలే విద్యుత్ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం
- ఆ కేంద్రం వద్ద కరెంట్ తీగలపై నుంచి వెళ్లిన లారీ
- షార్ట్ సర్క్యూట్ తో ఎగసిపడ్డ మంటలు
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ఘోర అగ్నిప్రమాదం గురించి మర్చిపోకముందే మరో ప్రమాదం సంభవించింది. ఇటీవల అగ్నిప్రమాదం సంభవించిన కేంద్రంలో ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, విద్యుత్ కేంద్రంలోకి సామగ్రిని తీసుకెళ్తున్న లారీ పక్కనే ఉన్న కరెంట్ వైర్ల మీద నుంచి వెళ్లింది. దీంతో, షార్ట్ సర్క్యూట్ సంభవించి, మంటలు ఎగసిపడ్డాయి. వెంటనే అక్కడున్న సిబ్బంది భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే ఇది నిజంగా సంభవించిన ప్రమాదం కాదని... మాక్ డ్రిల్ లో భాగమని తెలంగాణ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అగ్నిప్రమాదం సంభవించినప్పుడు సిబ్బంది ఎలా స్పందించాలో తెలిపేందుకే మాక్ డ్రిల్ ను నిర్వహించినట్టు తెలిపారు. మాక్ డ్రిల్ సమయంలో తాను కూడా అధికారులతో కలిసి విద్యుత్ కేంద్రానికి వెళ్లానని చెప్పారు.