నన్ను ఇంకో కేసులో ఇరికించే కుట్ర: యోగిపై కఫీల్ ఖాన్ ఫైర్

  • సీఏఏకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యల ఆరోపణలు
  • హైకోర్టు ఆదేశాలతో గతరాత్రి జైలు నుంచి విడుదల
  • ప్రభుత్వం రాజధర్మాన్ని మరిచి చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తోందని మండిపాటు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొని అరెస్టై ఎనిమిది నెలల తర్వాత గత అర్ధరాత్రి విడుదలైన డాక్టర్ కఫీల్ ఖాన్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనకు బెయిలు మంజూరు చేసిన అలహాబాద్‌ హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్ కఫీల్ ఖాన్.. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.

తనను ఇంకో కేసులో ఇరికించి జైలుకు పంపేందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజధర్మాన్ని మరిచి చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  తనను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని, కోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో విడుదల చేసిందని అన్నారు. కాగా, కఫీల్ ఖాన్ తల్లి మాట్లాడుతూ.. తన కుమారుడు ఎన్నడూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు.


More Telugu News