డాక్టర్ కఫీల్‌ఖాన్‌పై ఆరోపణలు తోసిపుచ్చిన కోర్టు.. అర్ధరాత్రి జైలు నుంచి విడుదల
- సీఏఏకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగం చేసినట్టు ఆరోపణలు
- జాతీయ భద్రతా చట్టం కింద అరెస్ట్
- గత ఎనిమిది నెలలుగా జైలులోనే
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కఫీల్‌ఖాన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఎనిమిది నెలలుగా జైలులో ఉన్న కఫీల్‌ఖాన్ గత అర్ధరాత్రి మధుర జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనపై ఆరోపణలు తోసిపుచ్చిన అలహాబాద్ హైకోర్టు, కఫీల్‌ఖాన్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశిస్తూ బెయిలు మంజూరు చేసింది.
గతేడాది డిసెంబరులో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో భాగంగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కఫీల్‌ఖాన్ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద జనవరి 29న గోరఖ్‌పూర్‌లో ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, కోర్టు ఆదేశించినప్పటికీ జైలు అధికారులు సత్వరంగా స్పందించకపోవడంతో ఖాన్ విడుదల ఆలస్యమైంది. దీంతో స్పందించిన ఖాన్ కుటుంబ సభ్యులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని హెచ్చరించారు. దీంతో ఆగమేఘాల మీద గత అర్ధరాత్రి జైలు అధికారులు విడుదల చేశారు.