రైనా మేనత్త కుటుంబంపై దాడి ఘటనలో సిట్ నియామకం
- ఇటీవల పంజాబ్ లో దారుణం
- రైనా బంధువులపై దొంగల దాడి
- ఇద్దరు మృతి
పంజాబ్ లోని పఠాన్ కోట్ లో ఇటీవల ఓ కాంట్రాక్టరు కుటుంబంపై దోపిడీ దొంగలు అత్యంత పాశవికంగా దాడి చేయడం తెలిసిందే. ఈ దాడిలో కాంట్రాక్టరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆయన తల్లి, భార్య, ఇద్దరు కుమారులు తీవ్రగాయాలతో ఆసుపత్రిపాలయ్యారు. చికిత్స పొందుతూ కుమారుల్లో ఒకరు మరణించారు. అయితే, ఈ ఘటనలో బాధితులు క్రికెటర్ సురేశ్ రైనా బంధువులు అని ఆలస్యంగా వెల్లడైంది. రైనా మేనత్త కుటుంబంపైనే దొంగలదాడి జరిగిందని తెలిసింది.
రైనా కూడా యూఏఈ నుంచి భారత్ తిరిగొచ్చేయడంతో ఈ ఘటన తీవ్రత వెల్లడైంది. ఇప్పుడతని మేనత్త చావుబతుకుల్లో ఉంది. దాంతో ఈ ఘటనకు కారకులపై కఠినచర్యలు తీసుకోవాలంటూ రైనా పంజాబ్ సీఎంను కోరాడు. ఈ నేపథ్యంలో సీఎం అమరీందర్ సింగ్ వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ కేసును త్వరగా తేల్చేందుకు సిట్ ను నియమించినట్టు తెలిపారు.
"బేటా, ఈ ఘటనకు కారకులను తప్పకుండా శిక్షిస్తాం" అంటూ రైనాకు సీఎం మాటిచ్చారు. కాగా, రైనా మేనత్త కుటుంబంపై దాడి చేసింది అత్యంత కిరాతకులైన 'కాలే కచ్చే గ్యాంగ్' సభ్యులని భావిస్తున్నారు.