ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబు, లోకేశ్, వర్లకు నోటీసులు

ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబు, లోకేశ్, వర్లకు నోటీసులు
  • చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడి ఆత్మహత్య
  • పెద్దిరెడ్డి వర్గం వేధింపులే కారణమన్న చంద్రబాబు
  • ఆధారాలతో హాజరు కావాలంటూ డీఎస్పీ నోటీసులు
వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఓం ప్రతాప్ ఆత్మహత్యకు మంత్రి పెద్దిరెడ్డి వర్గమే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. దీనిపై డీజీపీకి లేఖ కూడా రాశారు. టీడీపీ అగ్రనేతలు లోకేశ్, వర్ల రామయ్య కూడా ఈ అంశంలో తీవ్ర ఆరోపణలు చేశారు.

ఈ నేపథ్యంలో, ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబు, లోకేశ్, వర్ల రామయ్యలకు పోలీసులు నోటీసులు పంపారు. సీఆర్పీసీ 91 ప్రకారం మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి ఈ నోటీసులు జారీ చేశారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. వారంలోగా కార్యాలయానికి హాజరై ఆధారాలు ఇవ్వాలని డీఎస్పీ స్పష్టం చేశారు. వారు వ్యక్తిగతంగా రాలేకపోతే మరెవరితోనైనా పంపించాలని సూచించారు.


More Telugu News