ఈఎస్ఐ స్కామ్: మరింతగా బయటపడుతున్న దేవికారాణి, నాగలక్ష్మి అక్రమాస్తులు

  • బిల్డర్ కు రూ.4 కోట్లకు పైగా ఇచ్చిన దేవికారాణి, నాగలక్ష్మి
  • ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు యత్నం
  • ఏసీబీ అధికారులకు ఆ డబ్బు తిరిగిచ్చేసిన బిల్డర్
తెలంగాణ ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మిల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఓ రెసిడెన్షియల్ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించినట్టు గుర్తించారు.

ఓ బిల్డర్ కు రూ. 4 కోట్లకు పైగా ఇచ్చారన్న సమాచారంతో దాడులు చేసిన అధికారులు, ఆ బిల్డర్ వద్ద రూ.4.47 కోట్లను సీజ్ చేశారు. ఆ బిల్డర్ ఆస్తులను అటాచ్ చేస్తామని హెచ్చరించడంతో అతడు ఆ డబ్బును అధికారులకు తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తంలో రూ.3.37 కోట్లు దేవికారాణి డబ్బు కాగా, మిగతా డబ్బు నాగలక్ష్మికి చెందినదని సమాచారం. అవినీతి సొమ్ముతో వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించారని ఏసీబీ అధికారులు అంటున్నారు.


More Telugu News