గుంటూరుకు వెళ్లొద్దని ప్రణబ్ నాకు చెప్పారు: మాజీ ఎంపీ యలమంచిలి

  • నా పట్ల ఎంతో వాత్సల్యాన్ని చూపేవారు
  • పదవీ విరమణ చేసినప్పుడు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు
  • అయన మరణం తీరని లోటు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ విచారం వ్యక్తం చేశారు. తనపై ప్రణబ్ ముఖర్జీ ఎంతో వాత్సల్యాన్ని చూపించేవారని గుర్తు చేసుకున్నారు. ప్రణాళికా సలహా మండలిలో తాను సభ్యుడిగా ఉన్నప్పుడు పలు అంశాలపై తమ నివేదికలు చూసి ప్రణబ్ ఎంతో మెచ్చుకునేవారని చెప్పారు. తాను రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేసినప్పుడు తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారని తెలిపారు.

ఢిల్లీలోనే ఉండాలని, గుంటూరు వెళ్లొద్దని సూచించారని... వ్యవసాయంపై నియమించే హైపవర్ కమిటీలో ఉండమని తనకు ఆఫర్ ఇచ్చారని చెప్పారు. అయితే, తాను అప్పుడు అమెరికా వెళ్లానని తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన తనతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారని చెప్పారు. ఆయన మృతి తీరని లోటని అన్నారు.


More Telugu News