రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు

  • బడుగులపై దాడులు చేస్తున్నారని ఆవేదన
  • విలేకరులపై దాడులు జరిగాయన్న చంద్రబాబు
  • ఇద్దరు ఎస్సీలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని వెల్లడి
ఏపీలో గతకొంతకాలంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. బడుగు, బలహీన వర్గాలపై దాడులు చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు, తుని, సోమల, చీరాల ప్రాంతాల్లో విలేకరులపై దాడి చేశారని, పుంగనూరులో ఇద్దరు ఎస్సీలు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని తెలిపారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటేనే దాడులు ఆగుతాయని స్పష్టం చేశారు. ఈ లేఖ ప్రతులను ఆయన చిత్తూరు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీకి కూడా పంపారు.


More Telugu News