సుశాంత్ కేసులో రియా చక్రవర్తి తల్లిదండ్రులను విచారించిన సీబీఐ

  • సుశాంత్ మృతి కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ
  • ముంబయి డీఆర్డీవో గెస్ట్ హౌస్ లో రియా తల్లిదండ్రుల విచారణ
  • రియా, షోవిక్ లను నాలుగు రోజుల పాటు విచారించిన సీబీఐ
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ తాజాగా నటి రియా చక్రవర్తి తల్లిదండ్రులను విచారించింది. రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, తల్లి సంధ్య చక్రవర్తిలను ఇవాళ ముంబయిలోని డీఆర్డీవో గెస్ట్ హౌస్ కు పిలిపించారు. వారిని సుశాంత్ కేసు నేపథ్యంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించారు. కాగా, గత నాలుగు రోజులుగా రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్ ను విచారించిన సీబీఐ అధికారులు వారిద్దరినీ ఇవాళ విచారణకు పిలవలేదు. వారిద్దరిపై ఈ నాలుగు రోజుల్లో దాదాపు 35 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు.


More Telugu News