తెలంగాణలో ప్రారంభమైన ఆన్ లైన్ క్లాసులు.. వివరాలు!
- కరోనా కారణంగా తెరుచుకోని పాఠశాలలు, కాలేజీలు
- దూరదర్శన్, టీ-శాట్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు
- కాసేపటి క్రితం ప్రారంభమైన విద్యాబోధన
విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ కరోనా కారణంగా ఇన్ని రోజులు విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కాని సంగతి తెలిసిందే. అయితే, ఈ మహమ్మారి ప్రభావం మరెంత కాలం ఉంటుందో అర్థంకాని పరిస్థితి నెలకొని ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం దూరదర్శన్ ఛానల్, టీ-శాట్ ద్వారా ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించింది. మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు ఈరోజు క్లాసులు ప్రారంభమయ్యాయి.
క్లాసులకు సంబంధించిన షెడ్యూల్ ను రాష్ట్ర విద్యాశాఖ ఇంతకు ముందే ప్రకటించింది. క్లాసుల టైమ్ టేబుల్ ఈ విధంగా ఉంది. 3వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు క్లాసులను నిర్వహించనున్నారు. ఒక్కో క్లాసు సమయం గరిష్ఠంగా అరగంట ఉంటుంది. ఇంటర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తరగతులను నిర్వహించనున్నారు.