కరోనా మహమ్మారి నివారణ కోసం చైనా వింత విధానాలు!
- షింజియాంగ్‌లో 45 రోజులుగా కఠిన లాక్‌డౌన్
- సంప్రదాయ మందులను బలవంతంగా మింగిస్తున్న అధికారులు
- సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నా పట్టించుకోని వైనం
కరోనా నియంత్రణకు చైనా అవలంబిస్తున్న విధానాలు మరోమారు వివాదాస్పదమయ్యాయి. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వైరస్‌ను అడ్డుకోగలవని నిర్ధారణ కానప్పటికీ కొన్ని సంప్రదాయ మందులను ప్రజలతో బలవంతంగా వేయిస్తున్నట్టు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న వాయవ్య ప్రాంతమైన షింజియాంగ్‌లో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. క్లినికల్ పరీక్షల్లో ఏమాత్రం నిర్ధారణ కాని మందులను ప్రజలకు సరఫరా చేస్తూ వారితో బలవంతంగా మింగిస్తున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఆ మందుల సామర్థ్యంపై ప్రజలు ప్రశ్నిస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జైళ్లు, ఇతర నిర్బంధ కేంద్రాలలో అయితే బలప్రయోగం చేసి మరీ వారితో ఆ ఔషధాలు మింగిస్తున్నారు. ఈ మందులు వేసుకున్న వారిలో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వాంతులు, చర్మం పైపొర ఊడిపోతుండడం వంటి సమస్యలు కనిపిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. కాగా, షింజియాంగ్ లో గత 45 రోజులుగా కఠిన లాక్‌డౌన్ అమలవుతోంది.