ఎంఎస్ఎన్ గ్రూప్ ఔదార్యం.. కరోనా వారియర్స్‌కు ఉచితంగా ఫావిపిరావిర్ ట్యాబ్లెట్లు
- దేశ వ్యాప్తంగా 170కి పైగా నగరాల్లో ఉచిత ట్యాబ్లెట్ల పంపిణీ
- 91005 91030 నంబరుకు వివరాలు పంపితే మందుల హోం డెలివరీ
- అది తమ బాధ్యతన్న ఎంఎస్ఎన్ గ్రూప్ సీఎండీ
కరోనా పోరులో ముందున్న వైద్యులు, పోలీసులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది, జర్నలిస్టులకు కరోనాను నియంత్రించే ఫావిపిరావిర్ ట్యాబ్లెట్లను ఉచితంగా అందించేందుకు ఔషధ తయారీ సంస్థ ఎంఎస్ఎన్ గ్రూప్ ముందుకొచ్చింది.
దేశవ్యాప్తంగా 170కిపైగా నగరాలు, పట్టణాల్లో కొవిడ్ బారినపడిన కరోనా వారియర్లను గుర్తించి వారి ఇంటికే ఈ ట్యాబ్లెట్లను ఉచితంగా డెలివరీ చేయనుంది. ఈ ట్యాబ్లెట్లు పొందేందుకు టెస్ట్ రిపోర్టుతోపాటు వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, గుర్తింపు కార్డు కాపీని 91005 91030కు పంపాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఎంఎస్ఎన్ గ్రూప్ సీఎండీ ఎంఎస్ఎన్ రెడ్డి మాట్లాడుతూ విపత్తు సమయంలో ధైర్యంగా ముందుండి నిలిచిన వారికి సేవ చేయడాన్ని తమ బాధ్యతగా భావిస్తున్నట్టు చెప్పారు.