సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన చలమలశెట్టి సునీల్

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన చలమలశెట్టి సునీల్
  • గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానంలో ఓటమి
  • కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న సునీల్
  • సునీల్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్
కొంతకాలంగా టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్త చలమలశెట్టి సునీల్ వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన సునీల్ వైసీపీ కండువా కప్పుకున్నారు. సునీల్ ను సీఎం జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కురసాల కన్నబాబు, వేణు, ఎంపీ వంగా గీత, కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

చలమల శెట్టి సునీల్ రాజకీయప్రస్థానం ఎంతో ఆసక్తికరం అని చెప్పాలి. ఆయన ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేశారు. తొలుత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కాకినాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014లో అదే స్థానం నుంచి బరిలో దిగినా అదృష్టం కలిసిరాలేదు. దాంతో వైసీపీకి గుడ్ బై చెప్పి 2019లో టీడీపీ తరఫున పోటీ చేశారు. అయినా మరోసారి ఓటమి పలుకరించింది. దాంతో ఆయన టీడీపీకి దూరంగా ఉంటూ వచ్చారు.


More Telugu News