సచిన్ పరువు తీసిన ట్విట్టర్ అనువాదం!
- కేరళలో ఓనం సీజన్
- మలయాళంలో ట్వీట్ చేసిన సచిన్
- ఇంగ్లీషులో తప్పుడు అనువాదం చూపిస్తున్న ట్విట్టర్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గతంలో ఫుట్ బాల్ లీగ్ లో కేరళ బ్లాస్టర్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరించారు. అప్పటినుంచి సచిన్ కు కేరళతో మంచి అనుబంధం ఉంది. అందుకే కేరళీయుల ప్రధాన పండుగ ఓనం సందర్భంగా అక్కడి ప్రజలకు సచిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, కేరళీయులను సంతోషంలో ముంచెత్తాలని భావించిన సచిన్ మలయాళంలో ట్వీట్ చేశారు.
కానీ, ట్విట్టర్ మెషీన్ ట్రాన్స్ లేషన్ ఆ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని, తప్పుడు అనువాదాన్ని చూపించింది. సచిన్ ఎంతో ముచ్చటపడి చేసిన ఆ ట్వీట్ ను నవ్వులపాలు చేసింది. ఆ మలయాళ ట్వీట్ కు అనువాదంగా ట్విట్టర్ లో Who cares Happy Onam to all అని దర్శనమిస్తోంది. ఓవైపు తిడుతూనే, మరోవైపు శుభాకాంక్షలు తెలిపినట్టుందంటూ నెటిజన్లు ఓ రేంజిలో వ్యాఖ్యలు చేస్తున్నారు.
సచిన్ ట్విట్టర్ ఖాతాలో ఇంకా ఈ ట్వీట్ దర్శనమిస్తూనే ఉంది. సచిన్ మలయాళంలో తప్పుగా ట్వీట్ చేసినందునే అనువాదంలో ఆ తప్పు వచ్చిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.