జగన్ కు తెలుగు సరిగా రాదు: రఘురామకృష్ణరాజు

  • కరోనాను సీరియస్ గా తీసుకోవడం లేదు
  • లేచినప్పటి నుంచి కోర్టు కేసుల గురించే ఆలోచిస్తుంటారు
  • వీలైనంత త్వరగా విశాఖకు వెళ్లిపోవాలనేదే ఆలోచన
ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు తెలుగు సరిగా రాదని అన్నారు. కరోనా ఇప్పట్లో పోదు అనే విషయాన్ని చెప్పడానికి సహజీవనం అనే పదాన్ని జగన్ వాడారని విమర్శించారు. కరోనాను చాలా సీరియస్ గా చూడాలని... దాన్ని జగన్ లైట్ గా తీసుకోవడం దారుణమని అన్నారు. పొద్దున లేచినప్పటి నుంచి ఆయన కోర్టు కేసుల గురించే అలోచిస్తుంటారని అన్నారు. వీలైనంత తొందరగా విశాఖకు వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉంటారని చెప్పారు. తన నియోజకవర్గంలో 30 మంది కంటే తక్కువ కరోనా పేషెంట్లు ఉన్న గ్రామమే లేదని అన్నారు. విశాఖ కోసం కేటాయిస్తున్న సమయాన్ని కరోనా కోసం కేటాయించాలని హితవు పలికారు.


More Telugu News