కోహ్లీ సరసన నిలిచిన పాక్ క్రికెటర్ బాబర్ అజామ్!
- టీ-20ల్లో 1,500 పరుగులు
- ఇంగ్లండ్ రెండో టీ-20లో రికార్డు
- గతంలో ఈ ఫీట్ సాధించిన కోహ్లీ, ఫించ్
పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజామ్ అరుదైన రికార్డును సాధించి, విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్ ల సరసన నిలిచాడు. ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ-20లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ (56)తో చెలరేగిపోయిన బాబర్, అంతర్జాతీయ టీ-20 క్రికెట్ లో 1,500 పరుగులు సాధించిన ఆటగాళ్లలో చేరిపోయాడు.
అంతకుముందు ఈ ఫీట్ ను సాధించింది విరాట్ కోహ్లీ, ఫించ్ లు మాత్రమే. పొట్టి క్రికెట్ లో 1,500 పరుగులు సాధించడానికి అజామ్ కు 39 ఇన్నింగ్స్ లు అవసరం అయ్యాయి. తాజా హాఫ్ సెంచరీ అజామ్ కు 14వది కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 196 పరుగులు చేయగా, 197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ మోర్గాన్ 66, మలాన్ 54 పరుగులు సాధించడంతో సులువుగానే విజయం సాధించింది.