కల్లులో ఔషధ గుణాలు... బెంజ్ కార్లలో వచ్చి తాగిపోతున్నారన్న తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్!

  • 15 రకాల రోగాలను నయం చేసే కల్లు
  • క్యాన్సర్ నిరోధక గుణాలు కూడా
  • గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడివున్నాం
  • ఎక్సైజ్, టూరిజం మంత్రి శ్రీనివాస్ గౌడ్
స్వచ్ఛమైన కల్లులో 15 రకాల రోగాలను తగ్గించే ఔషధ గుణాలున్నాయని, ఈ విషయం శాస్త్రవేత్తల రీసెర్చ్ లో తేలిందని తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం కల్లు కోసం బెంజ్ కార్లలో సైతం వస్తున్నారని వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా, మండెలగూడెంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన, కల్లులో క్యాన్సర్ ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. గీత కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ సర్కారు కట్టుబడివుందన్నారు.

శివాజీ పరిపాలించిన సమయంలోనే సర్వాయి పాపన్న సామాజిక న్యాయం కోసం పోరాడారని, 400 ఏళ్ల క్రితమే ప్రజల్లో మార్పు కోసం ఆయన పోరాడారని కొనియాడిన ఆయన, పాపన్న కోటలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. బొమ్మకూరు రిజర్వాయర్ లో వీరు చేపపిల్లలను వదిలారు.


More Telugu News