గోనెసంచిలో వృద్ధురాలి మృతదేహం... బంజారాహిల్స్ లో కలకలం!
- దుప్పటిలో చుట్టి ఉన్న మృతదేహం
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
- సీసీ టీవీ కెమెరా ఫుటేజి పరిశీలించనున్న పోలీసులు
కరోనా వైరస్ భూతం విలయతాండవం చేస్తున్న వేళ హైదరాబాదు బంజారాహిల్స్ లో ఫుట్ పాత్ పై కనిపించిన ఓ మృతదేహం తీవ్ర భయాందోళనలు సృష్టించింది. ఇక్కడి రోడ్ నెం.2లో ఓ గోనెసంచి అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి అందులో ఓ వృద్ధురాలి మృతదేహం ఉన్నట్టు గుర్తించారు. కరోనా ప్రభావం నేపథ్యంలో, ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఆ గోనెసంచి తెరిచారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
ఆ మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి, గోనెసంచిలో ఉంచి అక్కడ ఎవరో వదిలి వెళ్లినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ కరోనాతో చనిపోతే ఆ విధంగా వదిలేసి వెళ్లారేమో అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ టీవీ కెమెరా ఫుటేజిని పరిశీలిస్తే ఏమైనా ఆధారాలు లభ్యం కావొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని బంజారాహిల్స్ పోలీసులు అంటున్నారు.