తమిళనాడు తీరానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం కళేబరం
- నేడు అంతర్జాతీయ వేల్ షార్క్ డే
- వాలినోక్కం వద్ద అలలతో పాటు తీరానికి చేరిన బ్లూ వేల్
- 20 మీటర్లు పొడవు, 7 టన్నుల బరువున్న తిమింగలం
ఇవాళ అంతర్జాతీయ తిమింగలాల దినోత్సవం కాగా, తమిళనాడు తీరానికి ఓ భారీ తిమింగలం కళేబరం కొట్టుకొచ్చింది. ఇది అతి పెద్దదైన బ్లూ వేల్ జాతికి చెందిన తిమింగలంగా గుర్తించారు. రామనాథపురం జిల్లా వాలినోక్కం వద్ద ఇది అలలతో పాటు కొట్టుకొచ్చింది. దీని పొడవు 20 మీటర్లు కాగా, బరువు 7 టన్నులు ఉన్నట్టు అంచనా వేశారు. ఇంత భారీ సముద్ర జలచరాన్ని చూసేందుకు స్థానికులు తండోపతండాలుగా విచ్చేశారు.