రియా చక్రవర్తిని 'విషకన్య'గా అభివర్ణించిన సుబ్రహ్మణ్యస్వామి
- సుశాంత్ వ్యవహారంలో రియాపై ఆరోపణలు
- రియాను కస్టడీలోకి తీసుకోవాలన్న సుబ్రహ్మణ్యస్వామి
- త్వరలోనే రియా అరెస్ట్ తథ్యమంటూ వ్యాఖ్యలు
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తిని ఆయన ఓ 'విషకన్య'గా అభివర్ణించారు.
'విషకన్య' రియాను కదిలిస్తే సుశాంత్ ను డ్రగ్స్ మత్తులో ముంచెత్తి, హత్య చేయడం వరకు అన్ని విషయాలు బయటికి వస్తాయని పేర్కొన్నారు. రియాను ప్రశ్నించి మరింత సమాచారం రాబట్టాలంటే కస్టోడియల్ విచారణ అవసరం అని, త్వరలోనే రియా అరెస్ట్ తథ్యమని తెలిపారు. జాతీయ ప్రయోజనాల రీత్యా కూడా మాదకద్రవ్యాల దందాను బట్టబయలు చేయాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్యస్వామి అభిప్రాయపడ్డారు.