వైసీపీ సిద్ధాంతకర్త కాబట్టే నూతన్ నాయుడుపై చర్యలు తీసుకోవడంలేదా?: నక్కా ఆనంద్ బాబు
- నూతన్ నాయుడు ఇంట్లో శిరోముండనంపై నక్కా ఆగ్రహం
- దళితులపై దాడులకు నిరసనగా గుంటూరులో దీక్ష
- దళితులు ఆత్మగౌరవం చంపుకుని బతుకుతున్నారని వ్యాఖ్యలు
రాష్ట్రంలో దళితులపై దాడులకు నిరసనగా టీడీపీ నేత, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు గుంటూరులో దీక్షకు దిగారు. బడుగులను హింసిస్తూ వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన దళితులపైనే దాడులు జరుగుతున్నాయని అన్నారు.
విశాఖలో శ్రీకాంత్ కు శిరోముండనం కేసులో నూతన్ నాయుడును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ మేనిఫెస్టో రూపకల్పనలో తాను కూడా ఉన్నట్టు నూతన్ నాయుడు స్వయంగా చెప్పుకున్నాడని, వైసీపీ సిద్ధాంతకర్త కాబట్టే నూతన్ నాయుడ్ని అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో దళితులు ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.