ముంబయి పోలీసులా... వద్దు బాబోయ్ అంటున్న కంగన!
- సుశాంత్ మరణం తర్వాత కంగనా ఆరోపణాస్త్రాలు
- బాలీవుడ్ డ్రగ్స్ దందాపై వివరాలు చెబుతానన్న కంగన
- తనకు రక్షణ కల్పించాలని విన్నపం
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత తొలి గొంతుక వినిపించింది స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఇండస్ట్రీలో బంధుప్రీతి ఏవిధంగా రాజ్యమేలుతుందో చెప్పిన స్లిమ్ బ్యూటీ కొన్నిరోజుల కిందట బాలీవుడ్ లో డ్రగ్స్ దందా ఎలా వేళ్లూనికునిపోయిందో ట్విట్టర్ లో వివరించింది. బాలీవుడ్ లో జరిగే పార్టీల్లో కొకైన్ ఎంత విచ్చలవిడిగా ఉపయోగిస్తారో తెలిపింది. ఈ నేపథ్యంలో తనకు రక్షణ కావాలని కోరింది.
దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ స్పందిస్తూ ఇంతవరకు మహారాష్ట్ర సర్కారు కంగనాకు ఎలాంటి రక్షణ కల్పించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనిపై కంగన వెంటనే బదులిచ్చారు.
తాను ప్రస్తుతం సినీ మాఫియా గూండాల కంటే ముంబయి పోలీసులు అంటేనే ఎక్కువ భయపడుతున్నానని, దయచేసి ముంబయి పోలీసులతో రక్షణ మాత్రం వద్దని చేతులు జోడించారు. తనకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కానీ, నేరుగా కేంద్రం కానీ రక్షణ కల్పించాలని కోరారు.