అనేక రాష్ట్రాలు కరోనాను జయిస్తున్నాయి.. ఏపీలో మాత్రం విజృంభణ: దేవినేని ఉమ
- మొత్తం కేసులు 4,14,164 కేసులు
- 3,796 మరణాలు
- పాజిటివ్ రేటు 17% పైగా పెరిగింది
- కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు?
ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరిగిపోతోన్న కరోనా కేసులను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. '4,14,164 కేసులు, 3,796 మరణాలు. ప్రతిరోజు 10 వేల పైనే కేసుల నమోదు, పాజిటివ్ రేటు 17% పైగా పెరిగింది. దేశంలో రోజువారీ కేసులు, మొత్తం కేసుల నమోదులో జాతీయ సగటులో ఏపీ ముందంజ' అని గుర్తు చేశారు.
'పటిష్ఠ ప్రణాళికలతో అనేక రాష్ట్రాలు కరోనాను జయిస్తున్నాయి. రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనాను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? వైఎస్ జగన్' అని దేవినేని ఉమ ప్రశ్నించారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో 62,024 మందికి కరోనా వైరస్ పరీక్షలు చేయగా 10,548 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కు చేరిన విషయం తెలిసిందే.