కమలా హారిస్ అసమర్థురాలు.. అధ్యక్ష పదవికి ఇవాంకా సరిగ్గా సరిపోతారు: ట్రంప్
- ఉన్నత పదవులకు కమలా హారిస్ లాంటి వారు సరిపోరు
- బైడెన్ అధ్యక్షుడైతే దేశంలో అరాచకం
- న్యూహాంప్‌షైర్ ప్రచారంలో ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూహాంప్‌షైర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ట్రంప్.. ఉపాధ్యక్ష పదవి రేసులో ఉన్న కమలా హారిస్‌పై విమర్శలు గుప్పించారు. ఆమె ఓ అసమర్థురాలని, ఉన్నత పదవులకు ఆమెలాంటి వారు ఎంతమాత్రమూ సరిపోరని అన్నారు. అమెరికాకు మహిళా అధ్యక్షురాలు ఉండాలని తాను కూడా కోరుకుంటున్నట్టు చెప్పారు. అయితే, కమలా హారిస్ లాంటి వారు మాత్రం కాదని అన్నారు. అప్పుడే సభలోని కొందరు ‘వి వాంట్ ఇవాంకా’ అని నినదించారు. స్పందించిన ట్రంప్.. ఇవాంకా అయితే అధ్యక్ష పదవికి సరిపోతారని అభిప్రాయపడ్డారు.
నిజానికి కమలా హారిస్ డెమోక్రాట్ల తరపున అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించినా, పార్టీలో తగినంత మద్దతు లేకపోవడంతో ఉపాధ్యక పదవి బరిలో నిలిచారు. ఈ కారణంగానే ఆమె అసమర్థురాలని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన ప్రత్యర్థి జో బైడెన్‌పై మరోమారు విరుచుకుపడిన ట్రంప్, అతడు కానీ అధ్యక్షుడైతే దేశంలో అరాచకం పెరిగిపోతుందని అన్నారు.