ముంబైలోని లతా మంగేష్కర్ భవనానికి సీల్!
- మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు
- వృద్ధులు అధికంగా ఉన్న ప్రభుకుంజ్ భవనం
- సీల్ వేస్తున్నట్టు ప్రకటించిన బీఎంసీ
మహారాష్ట్రలో కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండటంతో వృద్ధులు అధికంగా ఉన్న ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ భవనానికి సీల్ వేయాలని, బయటి నుంచి లోనికి ఎవరూ వెళ్లకుండా చూడాలని, లోపలి నుంచి బయటకు ఎవరినీ వెళ్లనివ్వకుండా చూడాలని బీఎంసీ అధికారులు నిర్ణయించారు.
ఈ విషయాన్ని లతా మంగేష్కర్ స్వయంగా ఓ ప్రకటనలో తెలుపుతూ, వయసు మళ్లిన వారు 'ప్రభుకుంజ్' బిల్డింగ్ లో ఎక్కువగా ఉన్నందున, వారి భద్రత క్షేమం కోసమే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ఈ మహమ్మారి వైరస్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇదే సమయంలో తమ ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఎటువంటి వదంతులను వ్యాపింపచేయవద్దని ఆమె కోరారు.