లక్నోలో దారుణం... కుటుంబ సభ్యులను కాల్చి చంపిన జాతీయ మహిళా షూటర్
- తల్లి, సోదరుడిపై కాల్పులు
- తీవ్ర గాయాలతో ఇద్దరూ మృతి
- అనంతరం ఆత్మహత్యకు యత్నించిన బాలిక
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో దారుణం జరిగింది. జాతీయ స్థాయిలో షూటింగ్ పోటీల్లో పాల్గొన్న ఓ అమ్మాయి తన కుటుంబ సభ్యులను కాల్చి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. లక్నోలోని గౌతమ్ పల్లి ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. ఓ సీనియర్ రైల్వే అధికారి కుమార్తె తన తల్లి మాలిని బాజ్ పాయి, సోదరుడు శరద్ లను తుపాకీతో కాల్చింది. ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
కాల్పులకు పాల్పడిన బాలిక పదో తరగతి చదవుతోంది. కొంతకాలంగా ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని వెల్లడైంది. కాగా, కాల్పులు జరిపిన అనంతరం ఆ బాలిక బ్లేడుతో కోసుకుని బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొద్దిపాటి గాయాలైన ఆ బాలికకు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసానికి కొన్ని కిలోమీటర్ల దూరంలోనే జరిగింది. దీనిపై పోలీసులు మాట్లాడుతూ, ఆ బాలిక నేరాన్ని అంగీకరించిందని, ఆమె మైనర్ అని తెలిపారు. ఆమెను బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు.