భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో సొరంగాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ దళాలు

  • జమ్మూ సమీపంలోని సాంబా వద్ద సొరంగం
  • 50 మీటర్ల పొడవున్న సొరంగం
  • ఉగ్రవాదుల పనే అయ్యుంటుందన్న బీఎస్ఎఫ్
పాకిస్థాన్ వైపు నుంచి భారత్ లో ప్రవేశించేందుకు ముష్కర మూకల ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. భారత భద్రతా బలగాలు ఆ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు వమ్ము చేస్తుండడం తెలిసిందే. తాజాగా, సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ దళాలు సాంబా ప్రాంతంలో ఓ సొరంగాన్ని కనుగొన్నాయి.

జమ్మూ సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దు కింది భాగంలో దీన్ని గుర్తించారు. ఈ సొరంగం పాకిస్థాన్ వైపు నుంచి తవ్వినట్టు తెలుసుకున్నారు. సరిహద్దు పొడవునా ఉగ్రవాదులు ఏర్పాటుచేసుకునే ఇలాంటి రహస్య నిర్మాణాలను గుర్తించేందుకు బీఎస్ఎఫ్ దళాలు ఇవాళ తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లోనే సొరంగం బయటపడింది.

ఇది 3 నుంచి 4 అడుగుల వెడల్పు ఉందని, 50 మీటర్ల పొడవు ఉందని అధికారులు తెలిపారు. అంతేకాదు, ఆ సొరంగంలో 10 ఇసుక మూటలను కూడా గుర్తించారు. వాటిపై పాక్ కు చెందిన చిహ్నాలు ఉన్నాయని, ఈ సొరంగం ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాల స్మగ్లర్ల కోసం ఏర్పాటు చేసి ఉంటారని బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి.


More Telugu News