గాంధీ కుటుంబాన్ని కించపరచాలనే ఉద్దేశం ఎవరికీ లేదు: కపిల్ సిబాల్
- పార్టీకి పునరుజ్జీవం పోయాలనేదే అందరి అభిమతం
- బీజేపీని ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి
- పార్టీ విజయం కోసం కలసికట్టుగా పని చేయాలి
కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ అధిష్ఠానానికి రాసిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసింది. ఈ లేఖపై సీడబ్ల్యూసీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. తాజాగా ఆ సమావేశంపై కపిల్ సిబాల్ మాట్లాడుతూ... పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించిన వారిని విమర్శించేందుకు దేశద్రోహులు, ఇంకా ఏవో పదాలు వాడారని అసహనం వ్యక్తం చేశారు.
ఆ లేఖ రాసిన సీనియర్లు తమ వాదనను సమర్థించుకున్నారని, ఆ లేఖను ప్రజలు చదివి ఉంటే ఎలాంటి అపోహలు తలెత్తేవి కాదని చెప్పారు. గాంధీ కుటుంబాన్ని కించపరచాలనే ఉద్దేశం ఎవరికీ లేదని... అయితే పార్టీకి పునరుజ్జీవం పోయాలనేదే అందరి అభిమతమని అన్నారు.
రానున్న రోజుల్లో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సిబాల్ చెప్పారు. త్వరలోనే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయని, ఈ తరుణంలో పార్టీ విజయం కోసం అందరూ సమష్టిగా పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.