ఆలయ పూజారా... మార్షల్ ఆర్ట్స్ యోధుడా..?

  • చెన్నై అష్టలక్ష్మి ఆలయ పూజారి శేషాద్రి వీడియో వైరల్
  • యుద్ధ విద్యలు ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్న ప్రధాన పూజారి
  • గతంలో టీటీడీ విజ్ఞప్తిని తిరస్కరించిన పూజారి
తమిళనాడులో ఉన్నన్ని హైందవ దేవాలయాలు మరెక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు. చెన్నై మహానగరంలోనూ అత్యధిక సంఖ్యలో ఆలయాలు దర్శనమిస్తాయి. అయితే చెన్నై బీసెంట్ నగర్ లో ఉన్న అష్టలక్ష్మి ఆలయం పూజారి కారణంగా గుర్తింపు దక్కించుకోవడం విశేషం. ఆయన పేరు శేషాద్రి. వృద్ధాప్యంలో ఉన్న ఆ ఆలయ ప్రధాన పూజారి వేదవేదాంగ పారంగతుడే కాదు, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ లో నిపుణుడు కూడా. పైగా భారతీయ పురాతన యుద్ధ విద్య సిలంబం లోనూ నిష్ణాతుడు.

కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించిన ఈ పూజారి జాతీయస్థాయి పోటీల్లో చాంపియన్ షిప్ సాధించడం విశేషం. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. అందులో శేషాద్రి ప్రదర్శిస్తున్న యుద్ధ విద్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. కాగా, గతంలో టీటీడీ శేషాద్రిని తిరుమల శ్రీవారికి సేవలు అందించే పూజారులకు కూడా యుద్ధ విద్యల్లో తర్ఫీదునివ్వాల్సిందిగా కోరింది. అయితే తాను బీసెంట్ నగర్ అష్టలక్ష్మి ఆలయంలో శాశ్వత ప్రాతిపదికన సేవలు అందిస్తున్నానని, తిరుమల రాలేనని స్పష్టం చేశారు.



More Telugu News