రాష్ట్రంలో దళితులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి!: నక్కా ఆనంద్ బాబు

  • ఒక దాడి అయితే పొరపాటున జరిగిందని అనుకోవచ్చు
  • మన రాష్ట్రంలో జరుగుతున్నన్ని దారుణాలు ఎక్కడా జరగడం లేదు
  • దళితుల కోసం ప్రభుత్వం ఏమీ చేయకపోయినా ఫర్వాలేదన్న టీడీపీ నేత
దళితులపై ఏపీలో జరుగుతున్నన్ని వేధింపులు, దాడులు, హత్యలు, శిరోముండనాలు మరే రాష్ట్రంలో జరగడం లేదని టీడీపీ నేత నక్కా ఆనందబాబు  అన్నారు. దాడి అనేది ఒకసారి జరిగితే  పొరపాటున జరిగిందని అనుకోవచ్చని, కానీ ఈ దారుణాలు నిత్యకృత్యంగా మారాయని చెప్పారు.

తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేసిన ఘటనను మరువక ముందే విశాఖలో శ్రీకాంత్ అనే మరో దళిత యువకుడిని దారుణంగా కొట్టి, గుండుకొట్టించారని విమర్శించారు. ప్రభుత్వ మద్యం పాలసీని ప్రశ్నించిన ఓంప్రతాప్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని చెప్పారు. దళితుల ఉన్నతి కోసం వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయకపోయినా పర్వాలేదని, కానీ దారుణంగా మాత్రం వ్యవహరించవద్దని కోరారు.


More Telugu News