చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో మరో ఆటగాడికి కరోనా

  • చెన్నై శిబిరంలో 13కి పెరిగిన కరోనా బాధితులు
  • బ్యాట్స్ మన్ రుతురాజ్ గైక్వాడ్ కు పాజిటివ్!
  • చెన్నై జట్టు పరిస్థితి కష్టమేనంటున్న క్రికెట్ వర్గాలు
ఎన్నో ఆశలతో యూఏఈ గడ్డపై కాలుమోపిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి టోర్నీ ఆరంభం కాకముందే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ శిబిరంలో కీలక పేసర్ దీపక్ చహర్ సహా పలువురు కరోనా బారినపడినట్టు తెలియగా, ఇప్పుడు మరో బ్యాట్స్ మన్ కు పాజిటివ్ అని తేలినట్టు వెల్లడైంది. ఆ బ్యాట్స్ మన్ ను మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ అని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ శిబిరంలో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 13కి పెరిగినట్టయింది. కొంతమంది సహాయక సిబ్బంది కూడా కరోనా బాధితుల్లో ఉన్నట్టు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై క్రికెట్ వర్గాలు స్పందిస్తూ, ఒకే ఫ్రాంచైజీలో 13 కేసులు వచ్చాయంటే, అది ఇతర ఫ్రాంచైజీలను కూడా ఆందోళనకు గురిచేస్తుందని పేర్కొన్నాయి.


More Telugu News